AP CM TO ATTEND TTD KAMADHENU GOPUJA AT NARASARAOPETA ON JANUARY 15 _ 15న నరసరావుపేట పేటలో టీటీడీ కామధేను పూజ – హాజరు కానున్న సిఎం శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
Tirumala, 12 Jan. 21: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy will take part in the prestigious Kamadhenu Gopuja mulled by TTD on the auspicious day of Kanuma on January 15 at Narasaraopeta in Guntur district.
TTD Additional EO Sri AV Dharma Reddy and JEO Sri P Basanth Kumar on Tuesday made a spot inspection of the venue of Sports Authority Stadium Grounds at Narasaraopeta where the sacred Kamadhenu Puja (Gopuja) as part of its agenda for Promotion of Sanatana Hindu Dharma on January 15.
TTD Additional EO and JEO directed officials to coordinate efforts with local MLA Dr Gopireddy Srinivasa Reddy and Guntur District Administration and complete all arrangements on a war footing.
SIMULTANEOUS GOPUJA ALL OVER STATE: TTD JEO SRI P BASANTH KUMAR
Speaking to media, TTD JEO Sri P Basanth Kumar said since decades TTD has been conducting Gopuja on Kanuma festival day. This year besides the 50 temples in TTD, Gopuja will be conducted at all 996 temples of the State Endowments Department on January 15. The Honourable CM will take part in the Kamadhenu Gopuja by 12noon at Narasaraopeta.
He also confirmed the participation of Honourable Chief Minister Sri YS Jaganmohan Reddy in the Kamadhenu Gopuja which is aimed at bestowing prosperity and good health of entire humanity.
Local MLA Dr Srinivasa Reddy said it is a good fortune for the people of Narasaraopeta that the event is being conducted by TTD in Narasaraopeta where CM will also taking part. He expressed his confidence that this sacred event would bring good fortunes to State.
Guntur District Collector Sri Samuel Anand, Rural SP Sri Vishal Gunny, Kotappakonda Temple EO Sri Annapureddy Ramkoti Reddy, Local ISKON representatives, TTD CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
15న నరసరావుపేట పేటలో టీటీడీ కామధేను పూజ
– హాజరు కానున్న సిఎం శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
తిరుమల 12 జనవరి 2021: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీటీడీ జనవరి 15వ తేదీ కామధేను పూజ ( గోపూజ) నిర్వహించనుంది. స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ బసంత్ కుమార్ నేతృత్వంలో మంగళవారం అధికారులు స్థల పరిశీలన జరిపారు.
సత్తెనపల్లి మార్గం లోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ఇందుకు అనువైనదని నిర్ణయించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో , జెఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓకే సమయంలో గో పూజ : జెఈవో శ్రీ బసంత్ కుమార్
స్థల పరిశీలన అనంతరం జెఈవో శ్రీ బసంత్ కుమార్ మీడియా మాట్లాడారు. కనుమ పండుగ రోజు కొన్ని శతాబ్దాలుగా టీటీడీ గో పూజ నిర్వహిస్తోందన్నారు. ఈ సారి టీటీడీ ఆధ్వర్యంలో ని సుమారు 50 ఆలయాలతో పాటు, టీటీడీ ఆర్థిక సహకారంతో దేవాదాయశాఖ ఆధీనంలోని 996 ఆలయాలు, 6ఎ ఆలయాల్లో కూడా 15వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు గోపూజ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నరసరావుపేటలో జరిగే కామధేను పూజకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారన్నారు.
ఇది మహద్భాగ్యం : డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో టీటీడీ నరసరావుపేటలో కామధేను పూజ నిర్వహించడం ఈ ప్రాంత వాసుల మహద్భాగ్యమని శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి సిఎం గా ప్రమాణ స్వీకారం చేశాక కామధేను పూజలో పాల్గొనడానికి తొలిసారి నరసరావుపేటకు రావడం సంతోషన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ్యూల్ ఆనంద్, రూరల్ఎస్పీ శ్రీ విశాల్ గున్ని,కోటప్ప కొండ ఆలయ ఈవో శ్రీ అన్నపురెడ్డి రాంకోటి రెడ్డి, స్థానిక ఇస్కాన్ ప్రతినిధులు, టీటీడీ సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ బసంత్ కుమార్ కోటప్పకొండ ఆలయాన్ని దర్శించుకున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది