17 TEAMS PERFORM IN HAMSA VAHANAM _ హంస వాహనసేవలో కళానీరాజనం

TIRUMALA, 28 SEPTEMBER 2022: A total of 17 teams performed as part of the ongoing annual Brahmotsavams in Tirumala on the second day evening during Hamsa Vahana Seva on Wednesday.

 

Puducherry’s Pambai Attam, Kerala’s Udipi Nrityam, Drums, Maharastra’s traditional dance, Odisha’s Kolatam by Rajmohan team remained cynosure.

 

The guise of various deities portrayed by Lalita Bhajana Mandali of Visakhapatnam, west Godavari’s Devarapalli dance, Gariga, Pillanagrovu, Yakshagana, Chekka Bhajana, Lambidara Dance etc. also stole the hearts of devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

హంస వాహనసేవలో కళానీరాజనం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 28: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 17 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చాయి.

ఇందులో పుదుచ్చేరికి క‌ళాకారుల పంబైయాట్టం, కేర‌ళ రాష్ట్రం గురువాయూర్‌కు చెందిన క‌ళాకారుల ఉడిపి నృత్యం, కేర‌ళ డ్ర‌మ్స్‌, ప‌లుర‌కాల వాయిద్యాల‌తో మ‌హారాష్ట్ర క‌ళాకారుల భ‌జ‌న భ‌క్తుల‌ను అల‌రించాయి.

అదేవిధంగా, విశాఖ‌ప‌ట్నం చోడ‌వ‌రానికి చెందిన ల‌లిత మ‌హిళా భ‌జ‌న మండ‌లి స‌భ్యులు శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా వేష‌ధార‌ణ‌ల‌తో అల‌రించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లికి చెందిన క‌ళాకారులు ల‌లితా లంబోద‌ర నృత్యం, తిరుపతికి చెందిన రాజ‌మోహ‌న్ బృందం ఒడిశా సంప్ర‌దాయంలో కోలాటం, అదేవిధంగా గెరిగ నృత్యం, పిల్ల‌న‌గ్రోవి నృత్యం, హ‌రేరామ భ‌జ‌న‌, య‌క్ష‌గానం, చెక్క భ‌జ‌న‌ ఆక‌ట్ట‌కున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.