ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు తిరుపతి, జూలై 25, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు ఒకటిన సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. […]