JEO(H&E) INSPECTS SVIMS CANTEEN _ స్విమ్స్ భోజనశాలలో జేఈవో ఆకస్మిక తనిఖీ
TIRUPATI, 23 JUNE 2023: TTD JEO (H&E) Smt Sada Bhargavi on Friday inspected the SVIMS canteen in Tirupati.
She personally served food to the students and interacted with them about the quality, hygiene and taste.
DyEO Sri Govindarajan, Catering Special Officer Sri Sastry and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ భోజనశాలలో జేఈవో ఆకస్మిక తనిఖీ
– నాణ్యత పై విద్యార్థులతో అభిప్రాయ సేకరణ
తిరుపతి 23 జూన్ 2023: స్విమ్స్ లో వైద్య విద్య, పారా మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతను జేఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు.
జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులతో కలిసి భోజన శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. వంటశాల, భోజన శాల ను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది, విద్యార్థులకు సూచించారు.
డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, క్యాటరింగ్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది