TTD EO INSPECTS LEOPARD ATTACK SPOT _ చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో 

Tirumala, 23 June 2023: TTD EO Sri AV Dharma Reddy made a second visit to the 7th mile on the Alipiri footpath where a 3-year-old boy was attacked by a leopard on Thursday night.

Later speaking to the media he said the life threat to boy was averted as the attack was by a leopard calf and shouting by devotees and immediate flashlights from the Repeater station scared the wild cat to abandon the boy and fled to the woods. 

He said the forest officials had identified the leopard track between Galigopuram and Lakshmi Narashima Swami temple on the Alipiri footpath.

Hence it is organised to send 200 devotees together in a team after 7 pm on the footpath with security guards on the track and devotees advised to chant Govinda Nama, he added.

He also appealed to the devotees to be vigilant and to keep the children in the middle of their walk on the footpath.

The TTD EO said all-out plans were made to capture the cat and camera traps were installed to track their movements. Henceforth devotees will be allowed to climb Tirumala up to 6 pm on the Srivari Mettu Footpath and up to 10 pm on the Alipiri footpath. The security options for two-wheeler travellers on ghat roads after 6 pm in the evenings is being debated, he added.

TTD CVSO Sri Narasimha Kishore, CCF Sri Nageswara Rao, DFO Sri Satish, TTD DFO Sri Srinivas and VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

– కాలినడక భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు

తిరుమల, 23 జూన్‌ 2023: అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాడి చేసింది పిల్లచిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని ఈవో చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ శ్రీ సతీష్, టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.