జూలై 31 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

జూలై 31 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, జూలై 29, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 31 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆగస్టు 2వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతోపాటు శుక్రవార ఆస్థానం, రోహిణి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.