TEPPOTSAVAMS CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
Tirumala, 24 March 2024: The annual Five-day Teppotsavams concluded on a grand religious note in Tirumala on the pleasant Phalguna Pournami Sunday evening.
Devotees thronged the float festival in large number to witness Sri Malayappa, Sridevi and Bhudevi taking seven rounds in Swamy Pushkarini on the dazzling, colourfully decorated float amidst vedic chants, melam, devotional musical renditions.
HH Tirumala Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy and other officials were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమల, 2024 మార్చి 24: తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.