DEVOTEES BEELINE TO TUMBURU THEERTHAM _ తుంబురు తీర్థంకు విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు

TIRUMALA, 24 MARCH 2024: In connection with Tumburu Theertha Mukkoti on March 25, TTD made elaborate arrangements for the trekkers from Sunday itself.

With Phalguna Suddha Pournami lasting both on Sunday and Monday, the devotees especially trekking lovers hailing from Southern India and Maharastra made a beeline to one of the most important torrents located in the dense interior wood of the Seshachala ranges.

The devotees were allowed to trek from 5am till 3pm on Sunday. TTD has made elaborate arrangements of the distribution of Annaprasadam packets, water, buttermilk to the trekking devotees with the help of Srivari Sevaks.

Medical teams, ORS packets, Ambulance were kept ready to attend emergency services if any.

Security guards and Forest personnel were deployed all through the trek path to ensure safety and security of devotees.

The devotees will also be allowed to trek Tumburu Theertham on Monday from 5am till 11am only.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తుంబురు తీర్థంకు విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు

తిరుమల, 2024 మార్చి 24: మార్చి 25న తుంబూరు తీర్థముక్కోటికి విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఆదివారం, సోమవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సంద్భంగా విశేష సంఖ్యలో భక్తులు శేషాచల అడవుల్లోని తుంబూరుతీర్థ ముక్కోటికి వస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను అనుమతించారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, నీళ్లు, మజ్జిగ పంపిణీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వైద్య బృందాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచారు.
భక్తుల భద్రత కొరకు టీటీడీ భద్రత, పోలీస్, ఆటవి సిబ్బంది సేవలందిస్తున్నారు.

భక్తులను సోమవారం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తుంబురు తీర్థంకు అనుమతిస్తారు.

కాగా, ఆదివారం భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేసిన ఏర్పాట్లను విజిఓ శ్రీ నందగోపాల్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వైద్య అధికారి డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.