CHANDRAGIRI RAMALAYAM BRAHMOTSAVAMS _ ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 15 April 2024:. The annual Brahmotsavam in the ancient temple of Sri Kodanda Ramalayam in Chandragiri will be observed from April 17 to 25 with Ankurarpanam on April 16.
On April 23, Sri Sita Rama Kalyanam will be observed from 10am to 11:30am while Sri Rama Pattabhishekam on April 26 between 9am and 10:15am.
The HDPP is organising devotional cultural programmes every day during annual fest.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
– ఏప్రిల్ 16న అంకురార్పణ
తిరుపతి, 2024 ఏప్రిల్ 15: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 9.05 నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సర్లకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 9 నుండి 10.15 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.