35 కేంద్రాల్లో 16 వేల మంది విద్యార్థులతో ”శుభప్రదం”

35 కేంద్రాల్లో 16 వేల మంది విద్యార్థులతో ”శుభప్రదం”

తిరుపతి, ఏప్రిల్‌  27, 2013:  రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 16 వేల మంది విద్యార్థులతో శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 12 నుండి 18వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు జరుగనున్నాయి. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 11వ తేదీ సాయంత్రంలోగా వారికి సూచించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 26 కేంద్రాలు, బాలికలకు తొమ్మిది కేంద్రాల్లో ఈ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ కేంద్రాల వివరాలను దీనికి జతపరుస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.