45th DEATH ANNIVERSARY OF SRI RALLAPALLI ANANTAKRISHNA SHARMA ON MARCH 11 _ మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి

Tirupati, 10 March 2024: TTD is organising the 45th Death anniversary of Sri Rallapalli Ananthakrishna Sharma the music and literary exponent on Monday, March 11. 

The program to be held under the joint auspices of the Annamacharya Project and Hindu dharmic projects, the program at  Annamacharya Kalamandiram in Tirupati.

The fete will commence with floral tributes to the statue of Sri Rallapalli Ananthakrishna Sharma on Sri Padmavathi Mahila University Road.

The legendary scholar, a native of Anantapur district is credited for coining the title, Akashavani for All India Radio worked at Sri Venkateswara Oriental Research Institute and transcribed Annamacharya Sankeertans from copper plates and palm leaves

and was made Asthana Vidwans in 1979.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి

తిరుపతి, 2024 మార్చి 10: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సం కీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న సోమ‌వారం జరుగనుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వ‌ర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి స‌మ‌ర్పిస్తారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో శ్రీ అనంతకృష్ణశర్మ మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త ప్ర‌త్యేక అతిథిగా పాల్గొంటారు. రాళ్ల‌ప‌ల్లి సాహిత్యంపై టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు డా. గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌తి ఎన్‌సి.శ్రీ‌దేవి ప్ర‌సంగిస్తారు.

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.