SERVE DEVOTEES WITH DEVOTION FOR DIVINE GRACE – TIRUMALA JEO_ శ్రీవారి భక్తులకు భక్తిభావంతో సేవలందించాలి : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 23 January 2018: Render sincere services to multitude of devotees with devotion and win the divine grace of Lord Venkateswara, advocated, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The JEO combinedly addressed the TTD officers and Srivari seva volunteers deployed for Radhasapthami duty in four mada streets at Asthana Mandapam on Tuesday.

He said, every year the pilgrim crowd for this one day “Mini Brahmotsavam” has been increasing. “To give best possible services to the pilgrims, this year we have deputed around 400 senior officers and employees for four mada streets on January 24.

For North- mada street FACAO Sro O Balaji will be In-charge, East – mada street SE I Sri M Ramesh Reddy, South-mada street Devastanam Educational Officer Sri Ramachandra and for West mada street SE 3 Sri Sudhakar Rao act as overall supervisors. They will be assisted by other officers to see whether pilgrims are getting food, water, beverages, buttermilk on time or not.

Addressing sevakulu the JEO oriented them to offer the services to pilgrims to their best. “Especially you should ensure that every pilgrim gets water and food. Pay special attention to see that they will not throw food packets and water or buttermilk sachets. It is for the sevakulu to guide the pilgrims properly”, he maintained.

Earlier CVSO Sri A Ravikrishna said that redndering service Tirumala as an employee or as a volunteer is a boon given by Almighty and evey one should make use of this opportunity by serving the pilgrims in right spirit.

FACAO Sri O Balaji, Temple DyEO Sri Kodanda Rama Rao, SE II Sri Ramachandra Reddy, GM Transport Sri Sesha Reddy, PRO Dr T Ravi and other senior officers, over 1000 volunteers who are exclusively deputed for four mada streets service were also present.

Later the JEO also inspected the four mada streets to view the arrangements made for the big religious occasion.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి భక్తులకు భక్తిభావంతో సేవలందించాలి : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

జనవరి 23, తిరుమల 2018: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తకోటికి భక్తిభావంతో స్నేహపూర్వకంగా సేవలందించాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు ఉదయం తిరుమలలోని ఆస్థానమండపంలో టిటిడి ఉద్యోగులు, శ్రీవారి సేవకులకు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు అందించవలసిన సేవలను వివరించారు.

ఈ సందర్భంగా తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి పర్వదినాన శ్రీవారు సప్తవాహనాలపై దర్శనమిస్తారు కావున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తారని తెలిపారు. దీనిని ఒక్కరోజు బ్రహ్మూెత్సవం అని కాడా వ్యవహరిస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 400 మంది టిటిడి అధికారులు, సిబ్బందిని నాలుగ మాడ వీధులలో విధులు కేటాయించినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఉత్తర మాడ వీధిలో ఎఫ్‌ఎ ఆండ్‌ సిఏవో శ్రీ ఓ. బాలాజీ, తూర్పుమాడ వీధిలో ఎస్‌.ఇ1 శ్రీ రమేశ్‌ రెడ్డి, దక్షిణమాడ వీధిలో దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర, పడమర మాడ వీధినందు ఎస్‌.ఇ3 శ్రీ సుధాకర్‌ రావులు పర్వవేక్షిస్తారన్నారు. వీరి పర్వవేక్షణలో ఇతర అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులకు అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, పాలు అందించనున్నట్లు తెలిపారు.

శ్రీవారి సేవకులు ఆలయ నాలుగు మాడ వీధులలోని గ్యాలరీలలోనికి క్యూ పద్ధతిలో భక్తులు చేరుకునేలా సహకరించాలన్నారు. గ్యాలరీలలోని ప్రతి భక్తునికి సమయానుకులంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, పాలు ప్రత్యేక శ్రద్ధతీసుకొని అందరికీ అందేవిధంగా చూడాలన్నారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాద పాకెట్లు తదితరాలు విసిరివేయకుండా శ్రీవారి సేవకులు భక్తి భావంతో, సేవదృక్పదంతో, శ్రద్ధతో సేవలందిలని కొరారు. వాహనసేవల సమయంలో గ్యాలరీల్లోని భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా, భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు.

అంతకు ముందు టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ మాట్లాడుతూ శ్రీవారి వాహనసేవలు వీక్షించేందుకు తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు టిటిడి ఉద్యోగులు, విజిలెన్స్‌ సిబ్బంది తమకు లభించిన సేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్నేహపూర్వకంగా, భక్తిభావంతో సంతృప్తికరమైన సేవలందిచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్థికగణాంకాధికారి శ్రీ ఓ. బాలాజీ, ఆలయ డిప్యూటి ఈవో శ్రీ కోదండరామారావు, ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, టి.టి.డి ట్రాన్స్‌పోర్టు జి.యం. శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు, 1000 మందికిపైగా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.