MAHILA DAY ARRANGEMENTS REVIEW_ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

Tirupati, 27 February 2018: TTD Projects OSD Sri N Mukteswara Rao today said programs should be concieved for benefit of thegirls students at TTD educational institutions and women employees of the TTD as part of the Women day celebrations on March 8.

Reviewing the preparations for the celebration of Women’s Day at the Padmavati Rest house here he said prominent women who had excelled in various walks of society should be invited to speak on the ocassion.

Prominent among those who participated in the review meeting were TTD health officerk Dr Sharmista, DyEOs Smt Gautami, Smt Snehalatha, Smt Varalakshmi, Smt Nagaratha and Asst PRO Ms. P Neelima other women employees and others.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

ఫిబ్రవరి 27, తిరుపతి, 2018: టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీమతి స్నేహలత, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి నాగరత్న, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, మహిళా ఉద్యోగులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.