DAY 3 OF SRIVARI TEPPOTSAVAM AT TIRUMALA_ తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

Tirumala, 27 February 2018: Lord Malayappaswamy along with His Consorts blessed devotees on Day 3 of the Annual Teppotsavam on a colorfully decorated float around the Swami Pushkarini.

Along with His consorts Sridevi and Bhudevi, he went round three rounds in the Pushkarini after he was paraded on the four mada streets in a grand manner.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Haridranath, VGO Sri Raveendra Reddy participated in the Teppotsavam at Swami Pushkarini this evening.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

ఫిబ్రవరి 27, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.

కాగా, చివరి రెండు రోజులు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు  తెప్పపై భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.