TTD KALYANA MANDAPAMS SHOULD BE MADE USER-FRIENDLY-EO_ టిటిడి కల్యాణమండపాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలి : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశం
Tirupati, 5 March 2018: The refurbishment of TTD Kalyana Mandpams should be completed to make it more user friendly, said TTD EO Sri Anil Kumar Singhal.
During the review meeting with senior officers of TTD in conference hall of TTD administrative building in Tirupati on Monday, the EO said, devotees wish to perform the marriages of their kin in TTD Kalyana Mandapams as they feel it as a sentiment attached to the Divine Blessings. He directed the Engineering wing officials, to come out with an action plan to take up the civil, electrical, A/C works in TTD Kalyana Mandapams for the next review meeting which will be conducted soon.
As the summer season has commenced, EO instructed the concerned to re use the sprinklers arranged in four mada and provide relief to the pilgrims from scorching temperatures. The EO also directed to beautify the entire premises of the new Srivari Seva Sadan with green scape and instructed the IT wing officials to make changes in the existing on-line General Srivari Seva application enabling group as well individual registrations in 2-day, 3-day, 4-day and 7-day service. The department-wise deployment of Srivari Sevakulu should be checked from time to time to enhance efficiency of Srivari Seva services”, he maintained.
The EO said, there should be a detailed action plan while setting up toilets, queue lines etc. keeping in view the heavy pilgrim influx during Vaikuntha Ekadasi, Radhasapthami days. EO also directed the concerned, to water the plants which are planted in Alipiri footpath route regularly during the ensuing summer season.The second phase LED lighting works should be completed by this month end”, the EO instructed the Electrical wing officials. The EO also instructed the concerned officials to earmark some of the SSD counters to physically challenged pilgrims also which are coming up both at Tirupati and in Tirumala.
Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, FACAO Sri Balaji, other senior officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి కల్యాణమండపాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలి : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశం
మార్చి 05, తిరుపతి, 2018: టిటిడి కల్యాణమండపాల్లో ఆధునీకరణ పనులు పూర్తిచేసి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి కల్యాణమండపాల్లో వివాహాలు చేసుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని, ఇందుకు అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతులు చేపట్టేందుకు, అదేవిధంగా అవసరమైన చోట్ల ఎసి సదుపాయం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. కల్యాణమండపాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
వేసవి ప్రారంభమైన నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో ఉన్న నీటిని వెదజల్లే పైపులను వినియోగంలోకి తీసుకొచ్చి భక్తులకు ఎండవేడి నుండి ఉపశమనం కల్పించాలని ఈవో సూచించారు. నిర్మాణంలో ఉన్న శ్రీవారి సేవా సదన్ భవనం ప్రాంగణంలో చక్కటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి సేవలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల స్లాట్లలో వ్యక్తిగతంగా, బృందాలుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా అప్లికేషన్‌లో మార్పులు చేపట్టాలని ఐటి అధికారులకు సూచించారు. విభాగాలవారీగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల సంఖ్యను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, మరింత మెరుగ్గా సేవలను వినియోగించుకునేందుకు వీలుగా అప్లికేషన్‌ను రూపొందించాలని ఆదేశించారు.
వైకుంఠ ఏకాదశి, రథసప్తమి తదితర ముఖ్యమైన పర్వదినాల్లో అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్ల నిర్వహణ, మరుగుదొడ్లు తదితర కీలకమైన అంశాలకు సంబంధించి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఆహ్లాదం కల్పించేందుకు పెంచుతున్న పూలమొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. రెండో దశలో తిరుమలలో ఎల్‌ఇడి లైటింగ్ పనులను ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం ఏర్పాటుచేస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లలో దివ్యాంగుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు కేటాయించాలని సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.