RATES CARD MUST IN HOTELS-CVSO_ హోటళ్లలో ధరలపట్టిక లేకపోతే కఠిన చర్యలు : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirumala, 5 March 2018: The display of menu card with rates for the information of pilgrims should be must in all hotels failing which serious action will be taken, instructed TTD CVSO Sri A Ravikrishna.

The top cop of TTD inspected some hotels in Tirumala on Monday. Speaking on this occasion, the CVSO said, if the hotels failed to display the rate cards for menu outside, the pilgrims can immediately lodge a complaint in TTD call centre 0877-2233333. He instructed the owners of the hotels to serve qualitative food with reasonable rates. Later he interacted with the pilgrims about the quality of food served to them at different hotels.

TTD VSO Sri Ravindra Reddy, AVSOs Sri Nandishwar Bahu, Sri Srinath Reddy, Sri Chiranjeevulu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హోటళ్లలో ధరలపట్టిక లేకపోతే కఠిన చర్యలు : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

మార్చి 05, తిరుమల, 2018: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమలలోని హోటళ్లలో ధరలపట్టిక చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. తిరుమలలోని పలు హోటళ్లలో సోమవారం నాడు సివిఎస్‌వో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ హోటళ్లలో ధరల పట్టిక లేకపోతే భక్తులు టిటిడి కాల్‌ సెంటర్‌ నంబరు 0877-2233333కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొన్ని హోటళ్లలో ధరల పట్టిక లేకపోవడం, భక్తులకు మెనుకార్డు ఇవ్వకపోవడాన్ని గుర్తించామని, ఇకపై ఇలా జరగకుండా నిత్యం తనిఖీ చేస్తామని తెలిపారు. నాణ్యమైన ఆహారపదార్థాలను భక్తులకు అందించాలని హోటళ్ల యజమానులకు సూచించారు. పలు హోటళ్లలో అందిస్తున్న ఆహారపదార్థాల నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు.

ఈ తనిఖీల్లో టిటిడి విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ చిరంజీవులు, శ్రీ నందీశ్వర్‌బాబు, శ్రీ శ్రీనాథరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.