CM OFFERS SILK VASTRAMS TO LORD VENKATESWARA_ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

Tirumala, 13 September 2018: As a custom, the Honourable CM of AP Sri N Chandra Babu Naidu presented silk vastrams and on behalf of state government on the first day of annual brahmotsavams of Sri Venkateswara swamy at Tirumala which commenced on Thursday evening.

Earlier a procession started from Sri Vedi Anjaneya Swamy temple where in the Head of the State carried the vastrams over his head and entered Tirumala temple through Mahadwaram.

After the traditional welcome amidst chanting of vedic mantras and mangala vaidyams, the CM and his entourage presented the clothes and offered prayers to the presiding deity of Lord Venkateswara in Sanctum Sanctorum.

Later he was rendered vedasirvachanam by temple priests at Ranganayakula mandalam.

The Chairman TTD Trust Board, Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal and other officers presented Teertha Prasadams and laminated photo of Lord.

TTD SERVICES TO PILGRIMS AS WELL TO PUBLIC ARE IMPECCABLE-AP CM

The services of TTD to pilgrims and public are outstanding, said Honourable CM of AP Sri N Chandrababu Naidu.

During his visit to Tirumala on Thursday evening on the occasion of first day of brahmotsavams, the CM complimented TTD for its pilgrim initiatives as well for taking care of general public by taking up various social welfare activities.

The CM also said, when Late Sri Nandamuri Taraka Rama Rao was CM of AP, he started Anna prasadam Trust in 1985 and today the Trust has reached a corpus of 1000 crores. Similarly, the Pranadana Trust is also proving to be providing a new lease of life to many poor.

He said, the first preference is to provide best possible darshanam to pilgrims and at the same time safe guarding the temple tradition without deviating Agama Shastra.

TTD Trust Board Members Sri Challa Ramachandra Reddy, Sri Potluri Ramesh Babu,JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, VGO Sri Raveendra Reddy, Temple DyEO Sri Haridranath, Peishkars Sri Ramesh, Sri Nagaraj and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

సెప్టెంబరు 13, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు.

ముందుగా గౌ|| ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి స్వాగతం పలికారు. ఆ తరువాత గౌ|| ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్‌, శ్రీ అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి సేవా కార్యక్రమాలు అమోఘం : రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

శ్రీవారి ఆశీస్సులతో భక్తులకు ఆరోగ్యం, సిరిసంపదలు కలుగుతున్నాయని, భక్తులు సమర్పిస్తున్న కానుకలతో టిటిడి పెద్ద ఎత్తున చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమోఘమని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు కొనియాడారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజైన గురువారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం గౌ|| ముఖ్యమంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 12వసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి మహిమ గల దేవుడని, తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా ఇక్కడి సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని వివరించారు. కీ.శే.శ్రీ ఎన్‌టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నదానం ట్రస్టును ప్రారంభించారని, ఆ ట్రస్టుకు అందిన విరాళాలు వెయ్యి కోట్లకు చేరుకోవడం సంతోషకరమని అన్నారు. తాను ప్రారంభించిన ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు. విద్యాదానంలో భాగంగా తిరుపతిలో పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతోపాటు వర్సిటీలకు టిటిడి ఆర్థికసాయం అందిస్తోందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నానన్నారు. ఆ తరువాత గౌ|| ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు.

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు :

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్‌, శ్రీ అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, బోర్డు సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.