ONE CRORE DONATED _ ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ. 1.11 కోట్లు విరాళం

Tirupati, 17 Dec. 20: Chennai based businessman and philanthropist, Chairman of Access Health Care Sri Anurag Vardhaman Jain family donated Rupees one crore and eleven lakhs (Rs.1.11crore) to Sri Venkateswara Gosamrakshana trust.

The donor handed over the DD for the same to TTD Executive Officer Dr K S Jawahar Reddy in his chambers at TTD Administrative Building in Tirupati on Thursday.

In the past, he has donated Rs.2.1crore to SV Bhakti Channel Trust also in the month of July this year.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ. 1.11 కోట్లు విరాళం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 17: శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు గురువారం ఒక కోటి 11 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళంగా అందింది.

చెన్నైకి చెందిన వ్యాపార‌వేత్త, యాక్సెస్ హెల్త్ కేర్ ఛైర్మ‌న్ శ్రీ అనురాగ్ వ‌ర్ధ‌మాన్ జైన్ కుటుంబ స‌భ్యులు ఈ మేరకు విరాళం డిడిని తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు. ఈ దాత ఈ ఏడాది జూలైలో శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు రూ.2.10 కోట్లు విరాళంగా అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.