TEPPOTSAVAMS IN TIRUMALA _ మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala, 10 Mar. 21: The annual three-day Teppotsavams will be conducted from March 24 to March 28 in Swamy Pushkarini at Tirumala.

Every day these Teppotsavams will be observed between 7pm and 8pm. On the first day evening Sri Sita Lakshman Samita Ramachandra Murthy, on the second day Rukmini sametha Sri Krishnaswami, on the last three days Sridevi Bhudevi sametha Sri Malayappa Swamy will take a celestial ride on the finely decorated float in the sacred waters of Swami Pushkarini.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 2021 మార్చి 10: తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వ‌ర్చువ‌ల్ సేవ‌‌), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ ‌(వ‌ర్చువ‌ల్ సేవ‌లు)లను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.