INGREDIENTS FROM INDIGENOUS COW PRODUCTS DONATED _ శ్రీ‌వారికి రూ.కోటి విలువైన గో వ్య‌వ‌సాయ ఆధారిత వంట ప‌దార్థాలు విరాళం

Tirumala, 30 Jun. 21: TTD has received a unique donation of Rs. One crore worth of organic cereals and other ingredients produced out of Desi Cow products used for making Srivari Prasadam.

Former TTD Board member and My Home Group Chief Sri Jupalli Rameswara Rao has sent this largesse prepared in Sri Tridandi Chinna Jeeyar Swamy Ashram at Hyderabad to TTD through another TTD Ex-board member Sri Shiva Kumar who in turn handed over the materials to the TTD officials in front of Tirumala temple on Wednesday.

The donation includes 6200kilos rice, 1500kilos desi ghee, 17kilos almonds, 315kilos cashew nuts, 85kilos mustard seeds, 18kilos fenugreek, 20kilos turmeric, 25kilos Asafoetida, nearly 850 kilos of different cereals, 50kilos rock salt, 350 kilos tamarind, 375kilos oil etc.

It may be mentioned here that during the last Board meeting a resolution had been taken to encourage indigenous organic products for making Naivedyam to Srivaru in the name “Govinduniki Go Adharita Naivedyam”.

Potu Peishkar Sri Srinivasulu, Temple OSD Sri P Seshadri, Organic Farmer Sri Vijayaram, Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, SVHVS Project Officer Dr A Vibhishana Sharma were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌వారికి రూ.కోటి విలువైన గో వ్య‌వ‌సాయ ఆధారిత వంట ప‌దార్థాలు విరాళం

జూన్ 30, తిరుమల 2021: తిరుమ‌ల శ్రీ‌వారికి గో వ్య‌వ‌సాయ ఆధారిత వంట ప‌దార్థాల‌తో సంపూర్ణ నైవేద్యం స‌మ‌ర్పించేందుకు వీలుగా దాదాపు ఒక కోటి రూపాయ‌లు విలువైన వంట దినుసులు బుధ‌వారం విరాళంగా అందాయి. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత శ్రీ జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం నుండి ఈ వంట‌ప‌దార్థాల‌ను పంపారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ ఈ వ‌స్తువుల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఆల‌య అధికారుల‌కు అంద‌జేశారు.

వీటిలో 6200 కిలోల బియ్యం, 1500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదాం, 315 కిలోల జీడిప‌ప్పు, 21 కిలోల కిస్‌మిస్‌, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల ప‌సుపు, 25కిలోల ఇంగువ‌, 380 కిలోల పెస‌ర‌ప‌ప్పు, 200 కిలోల శ‌న‌గ ప‌ప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింత‌పండు, 50 కిలోల రాక్ సాల్ట్‌, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు, ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతు శ్రీ విజ‌య‌రామ్‌, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.