HAYAGREEVA JAYANTHI OBSERVED _ జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవ స్వామి

Tirupati, 22 Aug. 21: Hayagreeva Jayanthi was observed by TTD at Ramachandra Pushkarini in Tirupati on Sunday under the aegis of HDPP Wing.

Sri Mahavishnu took this incarnation to restore the Vedas to Brahma, which were forcibly taken away by the demons. It was the responsibility of Lord Hayagreeiva to restore all the knowledge to the rightful place and hence He is being worshipped as the God of knowledge and wisdom. 

Every year, Hayagriva Jayanti falls on the Purnima in the holy month of Sravana.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవ స్వామి

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 22: శ్రీ హయగ్రీవ‌స్వామి వారు స‌క‌ల విద్యా, జ్ఞాన ప్రదాత, సాక్షాత్తు విష్ణుమూర్తి అవ‌తార‌మ‌ని తిరుపతికి చెందిన ఆచార్య ఇఎ సింగ‌రాచార్యులు తెలిపారు. తిరుప‌తి శ్రీ రామచంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఆదివారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు టీటీడీ ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ హ‌య‌గ్రీవ జ‌యంతిపై ఉపన్యాస కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి వేదాలను రక్షించారని తెలిపారు. వేదాలు జ్ఞానానికి చిహ్నాలనీ, వేదాలనే రక్షించిన హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారని వివరించారు.

అనంతరం డా.ల‌క్ష్మీనారాయ‌ణాచార్యులు ప్రసంగిస్తూ హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయని చెప్పారు. ఆయనలోని అణువణువూ దేవతామయమని తెలిపారు. అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంద‌ని వివరించారు.

ఈ రోజు లక్ష్మీపతి అయిన హయగ్రీవ స్వామివారిని ఆరాధించినవారికి సకల విద్యలు అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.