DWAJAVAROAHANAM HERALDS GRAND FINALE OF 2021- BTU _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Tirumala, 15 Oct. 21: TTD organised the Dwajavarohanam fete at the Srivari temple in Ekantham on Friday evening to signal the conclusion of the nine-day celebrations of Srivari annual Navaratri Brahmotsavam.

 

As part of the event, Bangaru Tiruchi Utsava was held inside the Srivari temple at 7.00 pm followed by the Dwajavarohanam ritual between 8.00-9.00 pm.

 

Legends say that Dwajavarohanam signalled that Garuda was bidding farewell to the galaxy of deities that participated in the Brahmotsavam fete and his invitation to them to come again next years celebrations.

 

As part of the event the Archakas chanted the seven holy mantras of Garuda Dhyanam, Bherinpuja, Bheri thadanam, Garuda gadyam, dikpalaka gadyam, Garuda Lagnastakam and Garuda churnika.

 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, TTD board members Sri Nanda Kumar, Additional EO Sri AV Dharma Reddy couple, TTD JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2021 అక్టోబ‌రు 15: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌ ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.