BRAHMOTSAVAMS FINALE HELD_ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

TIRUMALA, 05 OCTOBER 2022: The nine-day annual Brahmotsavams concluded with Dhwajavarohanam on Wednesday night.

 

In the evening Golden Tiruchi Utsavam is held followed by the ritual between 9pm and 10pm. The Garuda Flag was lowered marking the grand completion of the mega religious festival and bidding adieu to all the deities who participated and made the event a grand success.

 

HH Senior Pontiff and Junior Pontiff of Tirumala, EO Sri AV Dharma Reddy and others were present.

 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2022 అక్టోబరు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.