PARUVETA UTSAVAM HELD _ తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

TIRUMALA, 16 JANUARY 2023: On the auspicious occasion of Kanuma, Paruveta Utsavam was observed in Tirumala with religious fervour on Monday.

The processional deities of Sri Malayappa Swamy on a Tiruchi accompanied by Sri Krishna Swamy on another Tiruchi were brought to Paruveta Mandapam located in the interior woods of Seshachala hills.

Sri Malayappa wearing a head guard and five weapons viz. Sudarshana Chakra, Panchajanya Conch, Nandaka Sword, Kaumodaki Gada and Sarga bow was seated on a special platform with Sri Krisna Swamy by His side.

The Annamacharya Project artists rendered Sankeertans in a melodious manner followed by Nadaswaram.

After that Lord Krishna on the invitation of Sannidhi Golla visited their habitat and butter was offered as Naivedyam. The Sannidhi Golla was felicitated on the occasion.

Later, the most interesting episode of Mock Hunting by Sri Malayappa Swamy took place. The Weapon was thrown thrice by the office staff on behalf of Sri Malayappa. After Harati both the deities returns to the Temple. With this, the Paruveta Utsavam comes to an end.     

JEO Sri Veerabrahmam, SE 2 Sri Jagadeeshwar Reddy, EE Sri Jaganmohan Reddy, DE Sri Ravishankar Reddy, DyEO Sri Harindranath, Health Officer Dr Sridevi, DFO Sri Srinivasulu VGOs Sri Bali Reddy, Sri Giridhar and large number of devotees were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమల, 2023 జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము సోమవారం ఘనంగా జరిగింది.

సోమవారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు.

అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి.

శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు.

తరువాత శ్రీ మలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది.

శ్రీ మలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, డిఇ శ్రీ రవి శంకర్ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.