GOLD SAREES DONATED _ శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు చీరల బహూకరణ

TIRUPATI, 09 APRIL 2023: Sri Nalla Vijay from Siricilla of Telangana has presented two unique sarees that could be fit into a matchbox to Tirumala Sri Venkateswara Swamy and Tiruchanoor Sri Padmavathi Devi.

 

He has presented these sarees to TTD over the hands of CS of AP Dr KS Jawahar Reddy at Sri Padmavathi Rest House in Tirupati on Sunday.

 

The cost of the saree presented to Srivaru is about Rs. 45000 while the one donated to Ammavaru has 5gms of Gold zari in its weaving.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు చీరల బహూకరణ

తిరుపతి 9 ఏప్రిల్ 2023: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన శ్రీ నల్ల విజయ్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందించారు.

స్వామి వారికి రూ 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర తయారు చేయించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది