ADMISSION OPEN IN SVCMD _ మే 26 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

APPLICATION FROM MAY 26 AND CLASSES FROM JUNE 21

Tirupati, May 20 2023: TTD has invited applications from interested eligible candidates for various courses in TTD-run fine arts institutions of SV College of Music and Dance and SV Nadaswaram School for the academic year 2023-24 from  May 26 onwards.

The TTD institutions offered full-time courses of Visharada(diploma), Praveena(advanced diploma)in vocal, flute veena, violin, Nadaswaram, Dolu, Bharata Natyam, Kuchipudi, Harikatha, Mrudangam and Ghatam.

The SV Nadaswaram and Dolu school also offers full-time certificate and diploma courses.

The academic classes slated to start from June 21 and hostel facilities available for non local students only.

Interested students could procure applications from the offices of the respective institutions during the working hours with payment of ₹50 for application.

The eligible qualification for regular courses is Eighth standard pass and for evening classes the qualification is only 5th standard pass.

For more details contact the office during working hours  on 0877-2264597.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 26 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి 20మే 2023: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2023-24వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి మే 26వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. జూన్ 21వ తేదీ నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది