ASHTABANDHANA MAHASAMPROKSHANAM TO BEGIN AT DEVUNI KADAPA TEMPLE _ ఆగ‌స్టు 23న దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ

Tirupati / Devuni Kadapa, August 22, 2026: The Ankurarpana for the Jeernoddharana Ashtabandhana Mahasamprokshanam at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, will be held on August 23 as per Agama traditions.

The rituals will continue from August 23 to 26, with the Mahasamprokshanam scheduled on August 26 from 9.45 am to 11.30 am.

Devotees will be allowed darshan of the Moolavarlu from the afternoon of August 26 after completion of the Mahasamprokshanam.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 23 దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ

తిరుపతి / దేవుని క‌డ‌ప, 2026 ఆగ‌స్టు 22: దేవుని క‌డ‌పలోని శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు ఆగ‌స్టు 23న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

ఆగ‌స్టు 23న సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు వాస్తుశాంతి, మృత్సంగ్రహణము, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఆగ‌స్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమము, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనము, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగ‌స్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనము, మూర్తి హోమము, అష్టబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి.

ఆగ‌స్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమము, ప్రాయశ్చిత్త హోమము నిర్వహిస్తారు. ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం 26వ తేదీ మధ్యాహ్నం నుండి స్వామి, అమ్మవార్ల మూలవర్ల  దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.