DIVINE UMBRELLAS FOR GARUDA SEVA REACHES TIRUMALA _ గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు
Tirumala, 18 September 2026: Hindu Dharmartha Samiti brought nine umbrellas from Chennai to Tirumala on Friday to utilise the same during Garuda Seva on Friday evening as a part of the ongoing Srivari Salakatla Brahmotsavams.
The Samiti Trustee, Sri R.R.Gopalji has handed over the umbrellas to the TTD officials.
This is for the 22nd time that the Chennai-based Hindu Dharmartha Samiti has presented umbrellas to Srivaru.
TTD EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు
తిరుమల, 2026 సెప్టెంబర్ 18: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి.
ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.



