Rs.1.02 CRORE DONATION TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం
TTD CHAIRMAN SRI B.R.NAIDU APPRECIATES DONOR
Tirumala, October 2, 2026: Hyderabad-based donor Sri Nomula Ashok Kumar donated Rs.1.02 crore to the SV Pranadana Trust run by TTD.
He handed over the donation to TTD Chairman Sri B.R. Naidu at the TTD Camp Office in Hyderabad on Friday.
The Chairman appreciated the donor and thanked all donors for supporting the services of the SV Pranadana Trust. He wished that the blessings of Sri Venkateswara Swamy would always be upon the donor and his family.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం
దాత నోముల అశోక్ కుమార్‌ను అభినందించిన టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుమల, 2026 అక్టోబర్ 02: టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన దాత శ్రీ నోముల అశోక్ కుమార్ రూ.1.02 కోట్ల విరాళాన్ని అందజేశారు.
హైదరాబాద్‌లోని టీటీడీ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడును శుక్రవారం కలిసి ఈ విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా దాత శ్రీ నోముల అశోక్ కుమార్‌ను చైర్మన్ అభినందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు దాతకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

