PINDI DEEPA MAHOTSAVAM ON OCTOBER 3 WITH GOVINDA NAMA SMARANA _ గోవింద నామస్మరణతో అక్టోబర్ 03న పిండి దీప మహోత్సవం
TTD JEO DIRECTS OFFICIALS TO MAKE ELABORATE ARRANGEMENTS FOR DEVOTEES
Tirupati, October 2, 2026: TTD will organise Pindi Deepa Mahotsavam on Saturday, October 3, at 7:30 AM, with a Srinivasa Govinda Padayatra from the TTD Administrative Building Parade Grounds to Alipiri Padala Mandapam.
The programme will be jointly organised by TTD, Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project, Annamacharya Project and Sri Venkateswara Bhakti Channel.
TTD JEO (Health and Education), Sri Prabhala Gopinath, directed officials to ensure adequate drinking water, buttermilk and security arrangements for devotees.
The festival features a procession carrying a ghee-lit flour lamp amid Govinda Nama Smarana, symbolising the removal of ignorance and the spread of spiritual knowledge.
TTD appealed to devotees to participate in large numbers and experience spiritual bliss through Govinda Nama Smarana.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గోవింద నామస్మరణతో అక్టోబర్ 03న పిండి దీప మహోత్సవం
టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద పాదయాత్ర
భక్తులకు పటిష్ట ఏర్పాట్లు: టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్
తిరుపతి, అక్టోబర్ 02, 2026: అక్టోబర్ 03వ తేదీ శనివారం ఉదయం 7.30 గంటలకు నిర్వహించనున్న పిండి దీప మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద నామస్మరణతో పాదయాత్ర సాగనుంది.
ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.
పిండి దీపంలో నెయ్యితో జ్యోతిని వెలిగించి, గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ మహోత్సవ ప్రత్యేకత. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించడం, భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని, సనాతన ధర్మ వైభవాన్ని భావితరాలకు అందించాలని టీటీడీ జేఈవో విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు టిటిడి పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానం, అలిపిరి పాదాల మండపం వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం జేఈవో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్ ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, డీఈ శ్రీమతి సరస్వతి, ఎస్వీబీసీ సిపివో శ్రీ, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



