APPALAYAGUNTA TEMPLE RECEIVES SWACHHA ANDHRA AWARD –2026 _ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026

Tirupati, October 2, 2026: TTD’s Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta has received the Swachha Andhra Award–2026 from the Andhra Pradesh Government for its cleanliness and sanitation management.

The award was presented to Temple Superintendent Smt. Srivani by the District Collector during Gandhi Jayanti celebrations at Kachapi Auditorium, TUDA office premises, Tirupati, on Friday.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026

– పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో ఆలయానికి గుర్తింపు

తిరుపతి, 2026 అక్టోబరు 02: మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది.

తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాంధీ జయంతి సందర్భంగా ఆలయాలు, ధార్మిక సంస్థల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రదానం చేస్తోంది. 

ఇందులో భాగంగా ఈ ఏడాది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఈ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయ సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల