VALMIKIPURAM PATTABHIRAMA SWAMY PAVITHROTSAVAMS CONCLUDE _ పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati / Valmikipuram, October 26, 2026: The three-day Pavitrotsavams at Sri Pattabhirama Swamy Temple in Valmikipuram concluded ceremoniously on Monday with Maha Purnahuti.
Special rituals included Kalasa Prokshana, Abhishekam, Chakrasnanam and Pavitra Visarjana.
Temple Deputy EO Varalakshmi, AEO Gopinath, Temple Inspector Umapathi, officials and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి / వాల్మీకిపురం 2026 అక్టోబరు 26: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, అభిషేకం, చక్రస్నానం తదితర వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. స్వామివారికి చక్రస్నానం, పవిత్ర వితరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి తిరువీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉమాపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




