TTD REVIEWS ARRANGEMENTS FOR VAIKUNTA EKADASI _ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
Tirumala, 05 November 2026: TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary, along with CVSO Sri Murali Krishna, on Thursday reviewed arrangements for the ten-day Vaikunta Dwara Darshan, scheduled from December 20 to 29, at the Sudharma Meeting Hall in Tirumala.
The Additional EO directed officials to make elaborate and well-planned arrangements towards the smooth conduct of the prestigious event.
Referring to last year’s successful conduct, during which 7.83 lakh devotees had darshan, he asked officials to ensure similar arrangements this year.
He instructed officials to allot SSD tokens through online e-DIP for the first three days to facilitate darshan for ordinary devotees. Sarva Darshan will be provided for the remaining seven days.
Special arrangements will also be made for Sarva Darshan on December 25, during Srivari Abhishekam.
The Additional EO directed officials to continuously monitor queue lines through the Integrated Command Control Centre and ensure speedy darshan for common devotees.
CVSO Sri Murali Krishna said elaborate security and parking arrangements would be made, anticipating a heavy influx of devotees during the last seven days.
Senior TTD officials and departmental heads attended the meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2026 నవంబర్ 05: డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో గురువారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించి అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.
అధికమంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని చెప్పారు. తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా పగడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి పగడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ సోమన్నారాయణ, శ్రీ రమాకాంత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, ఎస్ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ వేణుగోపాల్, వీజీవో శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.







