SRINIVASA SEVA TRUST TO SUPPLY PADDY STRAW TO TTD GOSALA AS A TRADITIONAL SERVICE _ టీటీడీ గోశాలకు వంశపారంపర్యంగా వరి గడ్డి సరఫరా చేస్తాం

100 TONNES OF PADDY STRAW DONATED FOR COW PROTECTION

Tirupati | November 10, 2026: Amalapuram-based Srinivasa Seva Trust Chairman, Sri Nimmakayala Satyanarayana, has once again extended generous support to TTD Gosala by donating 100 tonnes of paddy straw for the maintenance of cows. He also expressed his willingness to supply paddy straw regularly to TTD Gosala as a traditional family service and requested TTD to grant the necessary prior permissions.

Sri Satyanarayana has earlier undertaken several service activities for TTD. Recently, he donated 2,000 helmets worth Rs.15 lakh, printed with the Srivari logo, for distribution among TTD employees.

In 2025, he donated 38 truckloads of paddy straw. In May 2026, Srinivasa Seva Trust, Amalapuram, jointly with Jyothula Nehru Foundation, Jaggampeta, supplied 1,600 tonnes of dry paddy straw in 180 truckloads to TTD Gosalas. The donation was made in the presence of Jaggampeta MLA and former TTD Board Member, Sri Jyothula Nehru, and was sufficient for feeding the cows for three months.

Dr. A.V.N. Sivakumar, Director of Sri Venkateswara Gosamrakshana Shala, appreciated Sri Satyanarayana’s continued support for cow protection and Srivari Seva. He also thanked the Jyothula Nehru Foundation and Srinivasa Seva Trust for their generous contributions.

He appealed to devotees to participate in the Govinda Go Seva programme and contribute towards the protection and nourishment of cows.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీ గోశాలకు వంశపారంపర్యంగా వరి గడ్డి సరఫరా చేస్తాం

శ్రీనివాసా సేవా ట్రస్ట్ చైర్మన్ నిమ్మకాయల సత్యనారాయణ వెల్లడి

గోసేవకు మరోసారి 100 టన్నుల వరి గడ్డి విరాళం

తిరుపతి, 2026, నవంబరు 10: తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలోని గోవుల పోషణకు అమలాపురానికి చెందిన శ్రీనివాసా సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ నిమ్మకాయల సత్యనారాయణ మరోసారి ఉదారంగా సహకారం అందించారు. ట్రస్ట్ తరఫున 100 టన్నుల వరి గడ్డిని విరాళంగా అందించడంతో పాటు, తమ వంశపారంపర్య సేవగా టీటీడీ గోశాలకు అవసరమైన వరి గడ్డిని నిరంతరం సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకు అవసరమైన ముందస్తు అనుమతులు మంజూరు చేయాలని టీటీడీని కోరారు.

గతంలోనూ శ్రీ సత్యనారాయణ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల రూ.15 లక్షల విలువైన 2,000 హెల్మెట్లపై శ్రీవారి లోగోను ముద్రించి టీటీడీ ఉద్యోగులకు పంపిణీ చేశారు.

అలాగే, 2025లో 38 లారీల వరి గడ్డిని, 2026 మే నెలలో జగ్గంపేటకు చెందిన శ్రీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాసా సేవా ట్రస్ట్ సంయుక్తంగా 180 లారీల ద్వారా 1,600 టన్నుల ఎండు వరి గడ్డిని టీటీడీ గోశాలలకు అందించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి మాజీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ సమక్షంలో అందించిన ఈ గడ్డి మూడు నెలల పాటు గోవుల పోషణకు ఉపయోగపడింది.

ఈ సందర్భంగా శ్రీవారి సేవతో పాటు గోసంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం సహకారం అందిస్తున్న శ్రీ నిమ్మకాయల సత్యనారాయణ సేవలను శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల డైరెక్టర్ డా.  ఏ.వి.ఎన్. శివకుమార్ అభినందించారు. గతంలో సహకారం అందించిన శ్రీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, జగ్గంపేట మరియు శ్రీనివాసా సేవా ట్రస్ట్, అమలాపురం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీవారి భక్తులందరూ గోవింద గోసేవ కార్యక్రమంలో భాగస్వాములై తమ వంతు విరాళాలు అందించి గోసేవా భాగ్యాన్ని పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి చేత విడుదల చేయబడినది.