SRI KALABHAIRAVA HOMAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిప్రపత్తులతో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం
Tirupati, November 17, 2026: As part of the ongoing Karthika Masa Homa Mahotsavams, Sri Kalabhairava Homam was performed ceremoniously at Sri Kapileswara Temple in Tirupati on Tuesday.
Ashtabhairava Homam, Maha Purnahuti and Mahashanti Abhishekam were performed as per tradition. Kalasabhishekam was also offered to the presiding deity, Sri Kalabhairava Swamy.
Special rituals were also scheduled for Sri Kamakshi Ammavaru in the evening. Chandiyagam will be performed from November 18 to 26.
Temple Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumari Devi, Superintendent Sri Chandrasekhar, priests and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిప్రపత్తులతో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం
శాస్త్రోక్తంగా అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి – శ్రీ కాలభైరవ స్వామివారికి కలశాభిషేకం
తిరుపతి, 2026 నవంబరు 17: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ కాలభైరవ హోమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారి మూలవిరాట్టుకు కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు.
సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారికి విశేష పూజలు
మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ కామాక్షి అమ్మవారికి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
నవంబరు 18 నుండి 26 వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి పేరిట చండీయాగం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.







