NO CHANGES MADE TO SECURITY / VIGILANCE GUARD RECRUITMENT RULES: TTD _ సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
Tirumala, 19 November 2026: TTD has clarified that its Specified Authority has not taken any decision to abolish the existing 1:2 ratio between ex-servicemen and civilians in direct recruitment to the posts of Security / Vigilance Guards in the TTD Vigilance Department.
TTD stated that the proposal to change the existing ratio and introduce a new recruitment system is still at the proposal stage, and no final decision has been taken on the matter.
The recruitment procedure that was in force earlier remains unchanged, and no modifications have been made to the recruitment rules, TTD clarified.
TTD also appealed to the public not to entertain any misconceptions or believe false propaganda regarding this issue.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
తిరుమల ,2026 నవంబరు 19: టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ నిష్పత్తిని మార్చి కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది.
గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని, నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
కావున, ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
