PARLIAMENTARY COMMITTEE APPRECIATES SCIENTIFIC MANAGEMENT OF SV GOSALA _ శాస్త్రీయ పద్ధతుల్లో ఆదర్శ ఎస్వీ గోశాల నిర్వహణ అభినందనీయం

Tirupati, November 21, 2026: A Parliamentary Consultative Committee on Animal Husbandry, led by Union Minister of State Sri S.P. Singh Baghel, visited TTD’s SV Gosala in Tirupati on Saturday.

The committee appreciated its scientific management, cleanliness, modern facilities, cattle care and quality fodder supply under the Rashtriya Gokul Mission.

The Gosala mainly rears indigenous Sahiwal cows and supplies pure milk, ghee and curd for the needs of the Srivari Temple at Tirumala and Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor.

The Minister expressed satisfaction over the facilities and hoped that SV Gosala would become a model Gosala for the country.

Telangana MP Sri Eatala Rajender, SV Gosala Director Dr. A.V.N. Siva Kumar and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శాస్త్రీయ పద్ధతుల్లో ఆదర్శ ఎస్వీ గోశాల నిర్వహణ అభినందనీయం

తిరుపతి ఎస్వీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ

•  సాహివాల్ జాతి ఆవుల ద్వారా స్వచ్ఛమైన పాలు, నెయ్యి, పెరుగు ఉత్పత్తి

•  శ్రీవారి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల అవసరాలకు స్వచ్ఛమైన పాడి ఉత్పత్తులు

•  ఎస్వీ గోశాల నిర్వహణ, పరిశుభ్రత, ఆధునిక సౌకర్యాలపై కమిటీ సంతృప్తి

తిరుపతి, 2026 నవంబరు 21: తిరుపతి ఎస్వీ గోశాలను కేంద్ర సహాయ మంత్రి గౌ.శ్రీ ఎస్.పి. సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ (పశుసంవర్ధక శాఖ) శనివారం సందర్శించింది.

ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం అనంతరం గౌ.సహాయ మంత్రి గోశాలను పరిశీలించారు. భారత ప్రభుత్వ రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM) పథకం కింద నిర్వహిస్తున్న ఈ గోశాలలో ఏర్పాటు చేసిన విశాలమైన, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన షెడ్లు, పశువుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన దాణా సరఫరా, నిర్వహణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ గోశాలలో ప్రధానంగా స్వదేశీ సాహివాల్ జాతి ఆవులను పెంచుతున్నట్లు తెలిపారు. వీటి నుంచి లభించే స్వచ్ఛమైన పాలు,  పెరుగు తదితర పాడి ఉత్పత్తులను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అవసరాలకు వినియోగించడం విశేషమన్నారు. పూజలు, అభిషేకాలకు అవసరమైన పాడి ఉత్పత్తులను నాణ్యత, స్వచ్ఛతతో అందించేందుకు ఈ గోశాల ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

గతంలో తాము సందర్శించిన సాధారణ గోశాలలతో పోలిస్తే, ఈ ఎస్వీ గోశాల ఆధునిక సౌకర్యాలతో, శాస్త్రీయ పద్ధతుల్లో రూపుదిద్దుకోవడం అభినందనీయమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎస్ వి గోశాల దేశానికే ఆదర్శవంతమైన గోశాలగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల