“SRIVARI YATRA SURAKSHA” A FIRST-OF-ITS-KIND INITIATIVE IN THE COUNTRY FOR PILGRIM SAFETY _ దేశంలోనే తొలిసారిగా”శ్రీవారి యాత్ర సురక్ష”తో భక్తులకు భరోసా
INSURANCE COMPENSATION HANDED OVER TO THE FAMILIES OF SEVEN PILGRIMS WHO DIED IN TIRUMALA
Tirumala, 24 November 2026: In a yet another unique and historical initiative TTD has handed over the compensation to the families of seven pilgrims who died in Tirumala in the last two months under “Srivari Yatra Suraksha” a group life insurance scheme launched jointly by Tirumala Tirupati Devasthanams (TTD) and Life Insurance Corporation of India (LIC) on Tuesday.
On Tuesday, along with TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, and LIC of India CEO and Managing Director Sri R. Doraiswamy, at Sudharma Conference Hall in Tirumala, the TTD Specified Authority Chairman and the EO handed over insurance compensation of Rs. 2 lakh each to the family members of seven pilgrims who had died naturally while visiting Tirumala for Srivari darshan in the past two months.
Speaking to the media on the occasion, he said that through the novel scheme, TTD provides assurance to pilgrims during their pilgrimage to Tirumala, marking a first-of-its-kind initiative in the country. The scheme which was launched on September 09 was designed to serve as a model for the entire country.
Under the scheme, Rs. 2 lakh is provided in the event of natural death, while Rs. 10 lakh is provided in case of accidental death. He said that 17 pilgrims had died in Tirumala during the past two months, and insurance compensation had been extended to the families of seven out of them. The remaining families would also receive compensation shortly, he added.
Additional EO Sri Ch. Venkaiah Chowdary said that the insurance scheme had been introduced after one-and-a-half years of dedicated efforts and series of negotiations, with the objective of setting an example for the country. He thanked LIC officials for their cooperation in introducing the Srivari Yatra Suraksha insurance scheme exclusively for TTD. He also said that steps would be taken to enhance the insurance compensation in the future.
LIC of India CEO and Managing Director Sri R. Doraiswamy said that under the Srivari Yatra Suraksha scheme, compensation of Rs.2 lakh was being provided to the families of devotees who unfortunately died during their pilgrimage to Tirumala. He said a system had been put in place to ensure prompt payment of compensation upon receipt of the death certificate and the nominee’s bank details.
Congratulating TTD for introducing the scheme to provide immediate financial assistance to the families of pilgrims who lose their lives during their pilgrimage, he assured that efforts would be made to ensure timely assistance to all eligible families.
He said TTD had emerged as a pioneering institution in providing life insurance coverage to pilgrims in the country. He further stated that officials from the Travancore Devasthanam Board at Sabarimala and the Vaishno Devi Shrine in Jammu had also approached LIC for consultations on implementing a similar scheme, inspired by TTD’s initiative.
On the occasion, the family members of seven deceased pilgrims that included four persons from Tamilnadu, two from Telengana and one from Andhra Pradesh, who had passed away in Tirumala between September 20 and October 26, received the insurance compensation of Rs.2lakh each. They expressed their gratitude to TTD for standing by them during their difficult times and providing much-needed financial assistance.
TTD JEOs Dr Sharath, Sri Gopinadh, CMO Dr Kusuma Kumari, Aswini Hospital CS Dr Subba Reddy, officials from TTD, LIC also participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
దేశంలోనే తొలిసారిగా”శ్రీవారి యాత్ర సురక్ష”తో భక్తులకు భరోసా
టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర
తిరుమలలో మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులకు బీమా పరిహారం అందజేత
భావోద్వేగానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు
తిరుమల, 2026 నవంబర్ 24: శ్రీవారి భక్తులకు ”శ్రీవారి యాత్ర సురక్ష” పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా తమ యాత్రకు భరోసా కల్పిస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చేసి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సీఈవో మరియు ఎండీ శ్రీ ఆర్.దొరైస్వామిలతో కలిసి మంగళవారం రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 9వ తేది ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. గత రెండు నెలల కాలంలో 17 మంది తిరుమలలో మరణించారని, వారిలో 7 మంది కుటుంబ సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని తెలియజేశారు.
అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి దేశానికి ఆదర్శవంతంగా ఈ బీమా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. టీటీడీ కోసం శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో మరియు ఎండీ శ్రీ ఆర్.దొరైస్వామి శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా తిరుమల యాత్ర సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయడం జరుగిందన్నారు. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్ర సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన టీటీడీని అభినందిస్తూ, అన్ని కుటుంబాలకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశంలో భక్తులకు జీవిత బీమా కవరేజ్ అందించే విషయంలో టీటీడీ మార్గదర్శక సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని చూసి తాము కూడా అమలు చేసేందుకు శబరిమలైలోని ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం అధికారులు తమతో సంప్రదింపులు చేసినట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా తిరుమలలో సెప్టెంబర్ 20వ తేది తిరుమలలో మరణించిన తమిళనాడుకు చెందిన శ్రీమతి డి. పప్పాతి (75) అనే భక్తురాలి కుమారుడు శ్రీ ఆర్.రాజేంద్రన్, సెప్టంబర్ 25వ తేది మరణించిన హైదరాబాద్ కు చెందిన శ్రీమతి డి.మహాలక్ష్మీ(74) కుమారుడు శ్రీ డి.శ్రీనివాసరెడ్డి, అక్టోబర్ 8వ తేది మరణించిన చెన్నైకు చెందిన శ్రీమతి నీలవేణి (58) కుమారుడు శ్రీ నవీన్ కుమార్, అక్టోబర్ 9వ తేది మరణించిన చెన్నైకు చెందిన శ్రీ టి.డి.గోపినాథ్ (41) అనే భక్తుడి భార్య శ్రీ జి.హరిణి, అక్టోబర్ 11వ తేది మరణించిన గుంటూరుకు చెందిన శ్రీ ఎం.దామోదరరావు(82) అనే భక్తుడి కుమారుడు శ్రీ ఎం.ప్రకాశ్, అక్టోబర్ 23వ తేది మరణించిన హైదరాబాద్ కు చెందిన శ్రీమతి భాగ్యమ్మ (45) సోదరుడు శ్రీ మోహనాచారి, అక్టోబర్ 26వ తేది మరణించిన చెన్నైకు చెందిన శ్రీ విశ్వనాథన్ రామకృష్ణన్(63) కుమార్తె కుమారి గాయత్రిలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తమకు ఈ కష్టకాలంలో చేదోడువాదోడుగా నిలిచి ఆర్థికంగా ఆదుకున్నందుకు టీటీడీకి
వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది..










