GRANDLY CONCLUDED CHANDI YAGAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ముగిసిన చండీయాగం

RUDRA YAGAM FROM NOVEMBER 27 TO DECEMBER 6

Tirupati, November 26, 2026: The nine-day Chandiyagam dedicated to Sri Kamakshi Ammavaru concluded grandly on Thursday at Sri Kapileswara Swamy Temple, Tirupati, as part of the month-long Homa Mahotsavams for the welfare of the world and devotees.

The concluding rituals included Maha Poornahuthi, Kalasa Udwasa, and special abhishekam to the Goddess.

As the next event, Rudrayagam will be performed from November 27 to December 6. Devotees can participate in the homam by purchasing a ticket for Rs.500 per day. Participating couples will receive traditional vastrams and annaprasadam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ముగిసిన చండీయాగం

నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు రుద్రయాగం

తిరుపతి, 2026 నవంబరు 26: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో లోకకల్యాణం, భక్తుల శ్రేయస్సు కాంక్షిస్తూ నెల రోజుల పాటు నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం గురువారం వైభవంగా ముగిసింది.

నవంబరు 18వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఈ చండీయాగం ముగింపు సందర్భంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో చండీహోమ సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవిరాట్టుకు కలశాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారికి కలశస్థాపన, విశేష పూజలు, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నవంబరు 27 నుంచి రుద్రయాగం

నెల రోజుల హోమ మహోత్సవాల్లో తదుపరి ఘట్టంగా నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి రుద్రయాగం నిర్వహించనున్నారు.

ఈ యాగంలో గృహస్తులు రూ.500 చెల్లించి టికెట్ కొనుగోలు ద్వారా ఒక రోజు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. యాగంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.