SPECIAL FESTIVALS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN DECEMBER _ డిసెంబరులో గోవిందరాజస్వామి ఆలయంలో విశేష ఉత్సవాల శోభ
SPECIAL PROCESSIONS ON VAIKUNTA EKADASI AND MUKKOTI DWADASI
Tirupati, November 28, 2026: Several special festivals and star celebrations will be held at Sri Govindaraja Swamy Temple in Tirupati during December.
Key events include:
• December 3 & 30: Uttara Nakshatram – Procession at 6 PM.
• *December 4, 11, 18 & 25:* Friday processions of Sri Andal Ammavaru at 6 PM.
• *December 13:* Special procession of Sri Govindaraja Swamy with His consorts at 5:30 PM.
• *December 16 to January 14:* Dhanurmasam special rituals.
• *December 20 & 21:* Vaikunta Ekadasi and Mukkoti Dwadasi processions at 8:30 AM.
• *December 23:* Rohini Nakshatram – Procession of Sri Parthasarathy Swamy with His consorts at 6 PM.
TTD appeals to devotees to participate in these celebrations and seek the blessings of the Lord and Goddess.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
డిసెంబరులో గోవిందరాజస్వామి ఆలయంలో విశేష ఉత్సవాల శోభ
వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ద్వాదశి సందర్భంగా ప్రత్యేక తిరువీధి ఉత్సవాలు
తిరుపతి, 2026 నవంబరు 28: తిరుపతిలోని టీటీడీ అనుబంధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, నక్షత్రోత్సవాలు, పర్వదినాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లు వివిధ వాహనాలు, తిరువీధి ఉత్సవాల ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర నక్షత్రం – డిసెంబరు 3, 30
సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు
శుక్రవార తిరువీధి ఉత్సవాలు – డిసెంబరు 4, 11, 18, 25
ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.
స్వామివారి తిరువీధి ఉత్సవం – డిసెంబరు 13
మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ నాంచారులతో కూడిన శ్రీ గోవిందరాజస్వామివారిని ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేపు చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు.
ధనుర్మాసం – డిసెంబరు 16 నుంచి 2027 జనవరి 14 వరకు
ఈ పవిత్ర మాసంలో ఆలయంలో ధనుర్మాస విశేష పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి (డిసెంబరు 20), ముక్కోటి ద్వాదశి (డిసెంబరు 21)
ఈ రెండు పర్వదినాల సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
రోహిణి నక్షత్రం – డిసెంబరు 23
సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
| తేదీ | ఉత్సవం | సమయం |
| డిసెంబరు 3, 30 | ఉత్తర నక్షత్రం | సా. 6 గం. |
| డిసెంబరు 4, 11, 18, 25 | శుక్రవార తిరువీధి (ఆండాళ్ అమ్మవారు) | సా. 6 గం. |
| డిసెంబరు 13 | స్వామివారి తిరువీధి ఉత్సవం | మ. 3 గం., సా. 5.30 గం. |
| డిసెంబరు 16 – జనవరి 14 | ధనుర్మాసం | రోజూ |
| డిసెంబరు 20, 21 | వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ద్వాదశి | ఉ. 8.30 గం. |
| డిసెంబరు 23 | రోహిణి నక్షత్రం | సా. 6 గం. |
భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
