SRI PADMAVATHI AMMAVARI ANNUAL KARTHEEKA BRAHMOTSAVAMS AT TIRUCHANOOR FROM DECEMBER 6 TO 14 _ తిరుచానూరులో డిసెంబర్ 06 నుండి 14 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

NINE DAYS OF DIVINE SPLENDOUR AS PER SRI PANCHARATRA AGAMA

Tirupati, November 28, 2026: The annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor will be held from December 6 to 14. As per tradition, the festival is conducted for nine days every year according to the Sri Pancharatra Agama.

Pre-festival events

•  Dec 1: Koil Alwar Tirumanjanam (temple cleansing)

•  Dec 5: Laksha Kumkumarchana in the morning, Ankurarpanam in the evening

Vahana Sevas Held from 8 AM to 10 AM and 7 PM to 9 PM.

| Date | Morning | Night |

 Dec 6 (Sun) | Dhwajarohanam | Chinna Sesha Vahanam |

| Dec 7 (Mon) | Pedda Sesha Vahanam | Hamsa Vahanam |

| Dec 8 (Tue) | Muthyapu Pandiri Vahanam | Simha Vahanam |

| Dec 9 (Wed) | Kalpavriksha Vahanam | Hanumantha Vahanam |

| Dec 10 (Thu) | Pallaki Utsavam | Gaja Vahanam |

| Dec 11 (Fri) | Sarvabhupala Vahanam | Swarna Ratham, Garuda Vahanam |

| Dec 12 (Sat) | Suryaprabha Vahanam | Chandraprabha Vahanam |

| Dec 13 (Sun) | Rathotsavam | Ashwa Vahanam |

| Dec 14 (Mon) | Panchami Theertham | Dhwajavarohanam |

| Dec 15 (Tue) | Pushpayagam | – |

Temple legend

According to the sthala purana, Goddess Padmavathi emerged from a golden lotus in the Padma Sarovara pushkarini, behind the temple. The place was first known as Padmavathipuram and later became Tiruchanoor. After Lord Sri Maha Vishnu performed penance for 12 years, the Goddess appeared on Karthika Shukla Panchami, a Friday, under Uttarashada nakshatra in Abhijit lagna. The Brahmotsavams begin nine days before this holy day.

Panchami Theertham

On the final day, Chakra Snanam is held in Padma Sarovara. Devotees believe a dip here gives the merit of bathing in the seven seas and crores of holy waters, and they come with their families to take part.

Arjita Sevas cancelled

•  Dec 1: All Arjita Sevas, Kumkumarchana and Break Darshan

•  Dec 5 to 16: All Arjita Sevas, Kumkumarchana, Vedasirvachanam and Break Darshan

Devotees are requested to take note and cooperate with TTD.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుచానూరులో డిసెంబర్ 06 నుండి 14 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం నవాహ్నిక వైభవం

తిరుపతి, 2026 నవంబర్ 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 06 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఉత్సవాలకు ముందు ముఖ్య కార్యక్రమాలు

డిసెంబర్ 01: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

డిసెంబర్ 05: ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ.

వాహనసేవల వేళలు

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు

తేదీ ఉదయం రాత్రి

06.12.2026 (ఆదివారం) ధ్వజారోహణం చిన్నశేష వాహనం

07.12.2026 (సోమవారం) పెద్దశేష వాహనం హంస వాహనం

08.12.2026 (మంగళవారం) ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం

09.12.2026 (బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

10.12.2026 (గురువారం) పల్లకీ ఉత్సవం గజ వాహనం

11.12.2026 (శుక్రవారం) సర్వభూపాల వాహనం స్వర్ణరథం, గరుడ వాహనం

12.12.2026 (శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13.12.2026 (ఆదివారం) రథోత్సవం అశ్వ వాహనం

14.12.2026 (సోమవారం) పంచమీ తీర్థం ధ్వజావరోహణం

15.12.2026 (మంగళవారం) పుష్పయాగం –

ఆలయ నేపథ్యం: బంగారు పద్మంలో అవతరించిన అమ్మవారు

తిరుచానూరు ఆలయ స్థల పురాణం ప్రకారం, శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలో బంగారు పద్మం నుండి ఆవిర్భవించినట్లు ప్రతీతి. అందుకే ఈ ప్రదేశానికి పద్మావతిపురం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే తిరుచానూరుగా మారింది. ఈ పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉంది.

పద్మసరోవర విశిష్టత

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో, బంగారు వర్ణంతో అమ్మవారు బంగారు పద్మం నుండి ఉద్భవించారు. ఆ పవిత్రదినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

పంచమీ తీర్థం: చక్రస్నాన పుణ్యఫలం

బ్రహ్మోత్సవాల చివరి రోజైన పంచమీ తీర్థం నాడు పద్మసరోవరంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి పునీతులవుతారు.

ఆర్జిత సేవల రద్దు

డిసెంబర్ 01: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం రద్దు.

డిసెంబర్ 05 నుండి 16 వరకు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు.

భక్తులు ఈ విషయాలను గమనించి, టిటిడికి సహకరించాలని కోరడమైనది.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.