TIRUCHANOOR KARTHIKA BRAHMOTSAVAM: ARRANGEMENTS WITHOUT INCONVENIENCE TO DEVOTEES _ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు

TTD JEO DR.A.SHARATHI DIRECTS ALL DEPARTMENTS TO WORK TOGETHER FOR A SUCCESSFUL FESTIVAL

Tirupati, November 28, 2026: TTD JEO Dr. A. Sharath has directed officials of all departments to complete arrangements quickly for the annual Karthika Brahmotsavams of Sri Padmavati Ammavaru at Tiruchanoor. He held a review meeting on Saturday at Tholappa Gardens with JEO (H&E) Sri Prabhala Gopinath.

Key Points

•  Works: Civil, electrical and floral decoration works to be finished on time at the temple, vahanam routes and main junctions.

•  Devotee facilities: Proper amenities, food (annaprasadam) and drinking water at holding points, with special attention to queue lines.

•  Officers in charge: Senior officials appointed for every event, as per EO Sri Muddada Ravichandra’s orders and Additional EO Sri Ch. Venkaiah Chowdary’s suggestions.

•  City decorations: Lighting and flower decorations at major junctions across Tirupati, not just at the temple.

•  Panchami Teertham: Special arrangements for the large crowds, including devotees from Tamil Nadu and other states.

Appeal to Devotees

Devotees are invited to take part in the Brahmotsavams. Those unable to attend can watch live telecasts on SVBC and social media.

Other senior TTD officials also attended the meeting.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు

పండుగ తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు  – 

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి: టీటీడీ జేఈవో డా. ఏ. శరత్

వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026, నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ ఆదేశించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్ లో జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపీనాథ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో  శనివారం ఆయన సమీక్ష  నిర్వహించారు.

పనుల పురోగతిపై సమీక్ష

సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పుష్పాలంకరణ తదితర విభాగాల పనుల పురోగతిని జేఈవో సమీక్షించారు. ఆలయ పరిసరాలు, వాహన సేవలు జరిగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

•  భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించాలి

•  హోల్డింగ్ పాయింట్ల వద్ద అన్నప్రసాదం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

•  భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సూచనలు, సలహాల మేరకు బ్రహ్మోత్సవాల్లోని ప్రతి కార్యక్రమానికి సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు జేఈవో తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టి కృషితో  బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

తిరుపతి నగరమంతా ఆధ్యాత్మిక శోభ

ఈసారి తిరుచానూరు ఆలయంతో పాటు తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపడుతున్నట్లు జేఈవో వెల్లడించారు. నగరవాసులందరూ అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ ఇంటి పండుగగా భావించి, భక్తిశ్రద్ధలతో పాల్గొని సహకరించాలని కోరారు.

పంచమితీర్థానికి ప్రత్యేక ఏర్పాట్లు

తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే పంచమితీర్థం రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆవిర్భావ మహోత్సవానికి ప్రతీకగా నిర్వహించే పంచమితీర్థంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భక్తులకు టీటీడీ విన్నపం

భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, వివిధ కారణాలతో రాలేని భక్తులు ఎస్వీబీసీ, సోషల్ మీడియా ద్వారా అందించే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ ఆకాంక్షిస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహర, ఎఫ్ ఏసీఏవో శ్రీ రవిప్రసాద్, ఎస్ ఈ ఎలక్ట్రికల్ శ్రీ వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ గోవిందరాజులు, శ్రీమతి వి.ఆర్ పార్వతి, శ్రీమతి నాగరత్న, శ్రీ సెల్వం, వీజీవో శ్రీ గిరిధర, గోశాల డైరెక్టర్ డా శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.