ENSURE SALE OF QUALITY TURMERIC AND VERMILION AT FOOTPATH ROUTES _ నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి

Tirumala, 28 November 2026: TTD Additional EO Sri Ch. Venkaiah Choudary directed officials to ensure that quality turmeric and vermilion are sold to devotees who offer worship to every step while trekking Alipiri and Srivari Mettu footpaths.

He reviewed the issue with TTD and Municipal Corporation health officials at Sudharma Meeting Hall in Padmavathi Rest House in Tirumala on Saturday.

He instructed officials to enforce regulations on the sale of puja materials at Alipiri and ensure that only quality turmeric and kumkum are sold to prevent devotees from slipping on the footpath. He also directed them to install signboards and create awareness among devotees.

TTD SE-2 Sri Venu Gopal, Estate Officer Sri Venkateswarlu, Health Dy EO Sri Somannarayana, Tirupati Municipal Health Officer Dr. Yuva Anvesh and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమల, 2026 నవంబర్ 28: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో మెట్ల పూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరి వద్ద పూజ సామాగ్రి విక్రయాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడక మార్గంలో భక్తులు జారిపడకుండా నాణ్యమైన పసుపు, కుంకుమను మాత్రమే విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పారు. ఈ మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో టీటీడీ ఎస్ఈ-2 శ్రీ వేణు గోపాల్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, తిరుపతి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.