THREE DAY, FOUR DAY ONLINE QUOTA COMES INTO FORE IN SRIVARI SEVA ON G-DAY_ శ్రీవారిసేవలో అందుబాటులోనికి 3 రోజులు, 4 రోజుల సేవలు ఆన్‌లైన్‌ బుక్కింగ్‌ విధానం

Tirumala, 27 September, 2017: To strengthen the Srivari Seva voluntary service and also to enable more number of educated, employed, youth to take part in pilgrim service, TTD mulled three-day (fri-sun) and four-day(mon-thu) special occasion online Srivari Seva along with seven day online Seva under the instructions of TTD E9 Sri Anil Kumar Singhal under the personal supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The temple management has enabled the registrations on the auspicious day of Garuda Seva on Wednesday for seven day, four day and three day Srivari Seva through online.

Seven-day: As the new application was under progress, TTD has stalled the seven day online Srivari Seva registration for a while. The registration is re opened on Wednesday under this category and also for Vaikuntha Ekadasi and New Year now. The age limit is between 18years to 60years only. The online registrations under this category are available every Tuesday and Wednesday.

Four-day: For this Seva, the age limit is same as in Seven day Seva. The service will be from Monday to Thursday with reporting day on Sunday.

Three-day: Under this category, which is aimed at encouraging educated, youth and employed sections, the age limit is fixed between 25 years to 40 years with Tenth standard as minimum qualification. They render service from Friday to Sunday with reporting day on Thursday.

Special Occasion Services: This category is also for those aged between 25years to 40years. The management holds the descretion of inviting this category few days before special and important festival Occasions viz. Brahmotsavams, Vaikuntha Ekadasi, Dwadasi, Radhasapthami etc.

The four day and three day services will come into existence after December 25 onwards. All the sevakulu who register online should alone report for service. The sevakulu are requested make note of these above norms and register accordingly to render services to fellow pilgrims.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిసేవలో అందుబాటులోనికి 3 రోజులు, 4 రోజుల సేవలు ఆన్‌లైన్‌ బుక్కింగ్‌ విధానం

గరుడసేవ శుభ సందర్భంగా ప్రారంభించిన తి.తి.దే

సెప్టెంబర్‌ 27, తిరుమల 2017: శ్రీవారి సేవ స్వచ్ఛందసేవ బలోపేతం చేయడంలో భాగంగా తి.తి.దే ఇ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న 3రోజులు, 4రోజుల శ్రీవారిసేవ ఆన్‌లైన్‌ బుక్కింగ్‌ విధానం బుధవారంనాడు గరుడసేవ శుభ సందర్భంగా తి.తి.దే అందుబాటులోనికి తీసుకువచ్చింది.

ఈ మేరకు తిరుమలకు విచ్చేసే భక్తులకు స్వచ్ఛంద సేవలు అందజేయకోరే భక్తులు శ్రీవారిసేవకులుగా ఈ 3రోజులు, 4రోజుల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనితోపాటుగా తి.తి.దే 7రోజుల ఆన్‌లైన్‌ శ్రీవారిసేవను కూడా తిరిగి పునరద్ధరించింది. ఇందుకుగాను తి.తి.దే యాజమాన్యం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ 3రోజులు, 4రోజులు మరియు 7రోజులు ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవారి సేవకు నమోదు చేసుకొనే భక్తులు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది.

7 రోజుల సేవ

18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న భక్తులు మాత్రమే ఈ సేవకు అర్హులు. వీరికి ప్రతి మంగళవారం, బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది. బుధవారంనాడు తి.తి.దే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరం కోటాను అందుబాటులోనికి తీసుకువచ్చింది.

4 రోజుల సేవ

18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న భక్తులు మాత్రమే ఈ సేవకు అర్హులు. ఈ సేవలు సోమవారం నుండి గురువారం వరకు ఉంటుంది. అందుకుగాను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులు సేవాసదన్‌ కార్యాలయంలో ఆదివారంనాడు రిపోర్టు చేయవలసి వుంటుంది. ఈసేవలు డిశెంబరు 25వ తారీఖుపై నుండి వినియోగంలోనికి వస్తాయి.

3 రోజుల సేవ

శ్రీవారి సేవలో యువతకు, విద్యావంతులకు, ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలన్న నిశ్ఛయంతో తి.తి.దే ఈ 3రోజుల ఆన్‌లైన్‌ సేవా విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందుకుగాను 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. వీరికి విద్యార్హత 10వ తరగతి. ఈ సేవలు శుక్రవారం నుండి ఆదివారం వరకు ఉంటుంది. అందుకుగాను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులు సేవాసదన్‌ కార్యాలయంలో గురువాఓరంనాడు రిపోర్టు చేయవలసి వుంటుంది. ఆలయ, భద్రత తదితర కీలకమైన ప్రాంతాలలో వీరి సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది.

ఎవరైతే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారో ఆ శ్రీవారి సేవకులే సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వ్యక్తిగాక మరొకరు వస్తే సేవకు అనుమతించబడరు. పై పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి సేవకులు భక్తుల సేవలో పాల్గొనాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.