TIRUMALA JEO REVIEWS WITH SECTORAL AND G-DAY OFFICERS_ సెక్టోరియల్ అధికారులతో జెఈవో సమీక్ష
Tirumala, 27 September 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Wednesday reviewed with senior officials who are deployed for sectoral and Garuda Seva duties at TTD control room located opposite Rambhageecha rest house.
He instructed the sectorial officers to take action against the shop keepers who are charging exorbitant rates on food items and drinking water. “You should not allow parking in front of shops and the Health Officer should ensure cleanliness in front of shops”, he added.
He later instructed the reception officials to be cautious on duty at CRO. ” The Finger prints mismatches are often happening at CRO counters. Need to guide the pilgrims to avoid confusion”, he told the reception officers.
All Senior Officers, sectoral officers, were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సెక్టోరియల్ అధికారులతో జెఈవో సమీక్ష
సెప్టెంబర్ 27, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం ఉదయం సెక్టోరియల్ అధికారులు, గరుడసేవలో విధులు కేటాయించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహం ఎదురుగా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లో బుధవారం టిటిడి ఉన్నతాధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆహారపదార్థాలు, తాగునీటిని అధిక ధరలకు విక్రయించే దుకాణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపి ఉంచరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఆరోగ్యశాఖాధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. సిఆర్‌వో వద్ద గదులు కేటాయింపు విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గదులు పొందే భక్తుల వేలిముద్రలను సరిచూసుకోవాలని సూచించారు. గదులు పొందే భక్తులు గందరగోళ పడకుండా తగిన సమాచారం అందించాలన్నారు. అనంతరం శాఖలవారీగా సమీక్ష నిర్వహించిన జెఈవో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో టిటిడి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.