PAVITHROTSAVAM AT CHANDRAGIRI KRT FROM OCT 11 TO 13_ అక్టోబరు 11 నుండి 13వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 7 October 2017: TTD plans to grandly celebrate three day Pavitrotsavam festival at the at sub temple, Sri Kodandarama Temple, Chandragiri from October 11 to 13.

Accordingly the traditional Ankuraranam event will be performed at the KRT on Tuesday,October 10 evening.

It is a vedic temple practice to perform Pavitrotsavam to ward off evil effects of any happenings inside the temple caused inadvertently either by the devotees or the temple staff. The event comprised of Alaya Shuddi abd Punya Havachana etc.

Devotees interested in participating in the traditional ritual could do do with a payment of Rs 200 and will be rewarded with one Pavitram and Swamivari thirtha prasadam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI

అక్టోబరు 11 నుండి 13వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబరు 07, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 10న మంగళవారం సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 11వ తేదీ బుధవారం ఉదయం చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి. అక్టోబరు 12న గురువారం ఉదయం పవిత్రసమర్పణ, హోమాలు, సాయంత్రం పవిత్ర హవనం, చతుష్టానార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 13న శుక్రవారం ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, సాయంత్రం ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి వీధి ఉత్సవం జరుగనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.