JEO RELEASES SKVST PAVITROTSAVAMS POSTERS_ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 11 October 2017: Tirupati JEO Sri Pola Bhaskar today released the wall posters of the Three day celestial ritual of Pavithrotsavam of the Sri Kalyana Venkateswara swamy temple of Srinivasa Mangapuram.

After the release function at his chambers in TTD Adm buildings, the JEO said Ankurarpanam will be performed on Oct 14 and the Veda Pathanama, Alaya Suddi and Punya havachanam rituals were also conducted.

The JEO said on Day1- pavitra pratistha, Day- 2- pavitra samarpana and Day-3 October-17 -veedihi utasavams and purnahuti will be performed. Devotees interested could participate with payment of Rs.500 and beget one Pavitra mala, one Uttariyam,one blouse and other Anna prasadams.

He said in view of the celestial event all kalyanotsavams, from Oct.15-17 and Swarna pushparchana on Oct.17 were cancelled in the Sri KVS temple.

Among others TTD local temples Dy EO Sri Venkataiah,and other officials participated in the function.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2017 అక్టోబరు 11: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అక్టోబరు 14వ తేదీన అంకురార్పణంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయన్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని, యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 15న పవిత్రప్రతిష్ఠ, రెండో రోజు అక్టోబరు 16న పవిత్ర సమర్పణ, చివరిరోజు అక్టోబరు 17న వీధి ఉత్సవం, పూర్ణాహుతి నిర్వహిస్తారని జెఈవో తెలిపారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చని, ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారని వివరించారు. పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, అక్టోబరు 17వ తేదీన స్వర్ణపుష్పార్చన సేవలను రద్దు చేసిన్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.