JEO INSPECTS UGRANAM AT SRIVARI TEMPLE_ శ్రీవారి ఉగ్రాణాన్ని పరిశీలించిన జెఈవో
Tirumala, 11 October 2017: The Tirumala Joint Executive Officer Sri KS Sreenivasa Raju today inspected the store room (Ugranam) near Srivari Temple where raw materials for Annaprasadam are kept to explore possibilities for expansion of the Srivari Potu.
After the inspection along with Chief Engineer Sri Chandrasekhar Reddy the JEO told said on directions of the EO Sri Anil Kumar Singhal a proposal to replace the old Ugranam building on the south Mada street with a modern store room on the West Mada street side near the Swami thirthakatta was being considered. This would help in easy movement of stock of dal flour needed in preparation of laddu boondi to the laddu boondi making unit.
He said such a move would in addition to the space for larger potu inside Srivari temple would facilitate increase of more laddus to meet devotee demands.
He said the VGO office would also be modernized into a major security complex.
Earlier the JEO inspected the arrangements in the queue lines in view of the devotee rush from Tamil Nadu on October 14 the Peritasi Saturday and directed officials to streamline queues, provide Annaprasadams and also drinking water in the queue lines.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
శ్రీవారి ఉగ్రాణాన్ని పరిశీలించిన జెఈవో
తిరుమల, 2017 అక్టోబరు 11: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులను నిల్వ ఉంచే ఉగ్రాణాన్ని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం ఉదయం చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు దక్షిణ మాడ వీధిలోని ఉగ్రాణం పాత భవనాన్ని తొలగించి పడమర భాగాన తీర్థకట్ట వీధికి ప్రక్కన ఉన్న ప్రాంతంలో సరుకులు సులువుగా చేర్చేందుకు వీలుగా నూతన భవనం నిర్మించే ప్రతిపాదనపై పరిశీలించినట్టు తెలిపారు. బూందీ పోటులో నిల్వ ఉంచే శనగపిండిని బయటకు తరలిస్తే గాలి, వెళుతురు సక్రమంగా ఉంటే వేడి తగ్గి ప్రమాదాల బారినపడకుండా చూడవచ్చన్నారు. శ్రీవారి ఆలయం లోపల పోటు, అదనపు పోటులో అదనంగా స్థలాన్ని గుర్తిస్తే అదనపు లడ్డూల తయారీకి అవకాశముంటుందని, దీనిపై కూడా పరిశీలన జరిపామని తెలిపారు. అదేవిధంగా విజివో కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అంతకుముందు అక్టోబరు 14న పెరటాశి నెల చివరి శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయం బయట క్యూలైన్లు క్రమబద్ధీకరణ, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.