DWADASI SWAMY PUSHKARINI TEERTHA MUKKOTI CHAKRASNANAM PERFORMED WITH RELIGIOUS FERVOUR _ వేడుకగా ద్వాదశి స్వామిపుష్కరిణి తీర్థ ముక్కోటిచక్రస్నానం

Tirumala, 30 December 2017: On the Following day of Vaikuntha Ekadasi, Chakrasnanam was performed to Sri Sudarshana Chakrattalwar in connection with the Swamy Pushkarini Teertha mukkoti which is observed on Vaikuntha Dwadasi day.
The Chakrattalwar was taken on a celestial procession to Swamy Puskarini between 4:30am and 5:30am on Tuesday and Chakrasnanam was performed.

It was strongly believed that Those who take holy dip in the pushkarini during this auspicious hour will get the merit of having taken bath in three crore theerthas located in Tirumala.

TTD EO Sri Anil Kumar Singhal, Temple DyEO Sri Rama Rao and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వేడుకగా ద్వాదశి స్వామిపుష్కరిణి తీర్థ ముక్కోటిచక్రస్నానం

డిసెంబరు 30, తిరుమల 2017వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.

శ్రీ స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఆలయ పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.