UNPRECEDENTED CROWD WITNESSED ON V-DAY-TTD EO_ అదనపు సిబ్బంది ద్వారా భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నాం : టిటిడి ఈవో

Q LINES CROSSED 2.35KM IN OUTER RING ROAD

WILL CONTEMPLATE LONG TERM STRATEGY

Tirumala, 29 December,2017 : The hill temple of Tirumala has witnessed never seen before crowd on Vaikunta Ekadasi day on Friday, said, TTD Executive Officer, Sri Anil Kumar Singhal.

Addressing media in his camp office on Friday evening in Tirumala along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna, the EO said that the devotees were given best possible darshan on the day of Vaikuna Ekadasi so far inspite of unprecedented rush.

The EO said TTD had commenced vaikunta dwara darshanam to common pilgrims from 8.05 hours onwards. ” Thanks to pilgrims for having waited for 30 hours in the q lines since midnight of December 27 in the VQC compartments, outside qlines in Narayanagiri Gardens, outer ring road(ORR) etc.

CONTINUOUS SUPPLY OF FOOD AND WATER BY SEVAKULU
He said TTD had made elbaorate arrangements of food, beverages and drinking water in the queue lines. We have laid 2.35km queue lines in ORR. But the pilgrim queue extended to 2km futher, which signifies the level of pilgrim influx for darshan of Lord on the special occasion. We have also arranged additional mobile toilets for the sake of devotees.

VAIKUNTA DWARA DARSHAN TO LAST TILL MIDNIGHT OF DEC 30
While welcoming the devotees to Tirumala, the EO urged the devotees to observe that the vaikunta dwara darsan will last only till midnight of December 30 and requested them to plan their darshan accordingly.

LONG TERM STRATEGY
After witnessing the kind of unprecedented pilgrim surge we are now contemplating long term strategy to the man the crowd once dwara darshan is complete.

ADDITIONAL STAFF
Right now to control the crowd we are deploying additional staff and volunteers.

EO, JEO, CVSO INSPECTS QUEUE LINES
With every inch of Tirumala being occupied with pilgrims, EO along with JEO and CVSO inspected outside queue lines and instructed Annaprasadam and Health wings to make necessary arrangements of food and water.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD, TIRUPATI

అదనపు సిబ్బంది ద్వారా భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నాం : టిటిడి ఈవో

డిసెంబరు 29, తిరుమల 2017 ; వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనార్థం విచ్చేసి కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి మెరుగ్గా సేవలందిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని తమ బంగళాలో శుక్రవారం సాయంత్రం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం 30 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అని తెలిపారు. శుక్రవారం సాయంత్రం తరువాత క్యూలైన్లలోకి ప్రవేశించే వారికి వైకుంఠ ద్వార దర్శనం లభించకపోవచ్చన్నారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. గతంలో 1.30 లక్షల నుంచి 1.60 లక్షల మంది భక్తులు రెండు రోజుల్లో శ్రీవారిని దర్శించుకునేవారని తెలిపారు. శుక్రవారం దాదాపు 80 వేల మందికి స్వామివారి దర్శనం లభించే అవకాశముందన్నారు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, గత ఏడాదితో పోల్చితే 40 వేల మంది భక్తులు అదనంగా ఉన్నారని తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల సాయంతో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, టి, కాఫి, పాలు అందిస్తున్నామన్నారు. అధిక రద్దీ సమయంలో క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి భవిష్యత్తులో చక్కటి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

మీడియా సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.